కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం

 


కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సోమవారం వరంగల్‌లో పర్యటిస్తున్న ఆయన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. కాగా వరంగల్‌లో రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. నిధుల కొరతతోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. వరంగల్‌ను గ్లోబల్ సిటీగా మారుస్తామన్నారు. ఏడాదికి రూ. 300 కోట్లు ఇస్తున్నామన్నారు. వరంగల్‌కు మోనో రైల్ తీసుకొస్తామని చెప్పారు. జరగబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు.