రాధేశ్యామ్ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్.

 


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా నుంచి సరైన అప్‌డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయిన సంగతి తెల్సిందే. అందుకే ఆ మధ్య వరసగా టైటిల్, బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ టీజర్, ప్రభాస్ - పూజా హెగ్డే పోషిస్తున్న విక్రమాదిత్య, ప్రేరణల లుక్, ఫస్ట్ గ్లింప్స్ .. ఇలా సర్‌ప్రైజెస్ ఇచ్చి కూల్ చేశారు. అయితే ఈ మధ్య రాధేశ్యామ్ సినిమా అప్‌డేట్స్ ఏవీ రావడం లేదని జూలై 30న సినిమా రిలీజ్ కాబోతున్నా ఇంకా ఫస్ట్ సింగిల్ గానీ టీజర్ గాని రిలీజ్ చేయలేదన్న డిసప్పాయింట్‌మెంట్‌లో అభిమానులున్నారట. చెప్పాలంటే మిగతా సినిమాల నుంచి ఏదో ఒక అప్‌డేట్ వచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు చేస్తున్నారు. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా రాధేశ్యామ్ నుంచి సర్‌ప్రైజెస్ కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకే కాదు ప్రేక్షకులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. త్వరలో రాధేశ్యామ్ సినిమా నుంచి ప్రభాస్ టీమ్ వరసగా సర్‌ప్రైజెస్‌కి ప్లాన్ చేశారట. అభిమానులకి ఇక పండుగే అని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ప్రభాస్ రాధేశ్యామ్ హంగామా మొదలవబోతోందట. ఏప్రిల్‌లో రెండు టీజర్స్‌తో పాటు ఒక్కో సాంగ్‌ని రిలీజ్ చేస్తూ వస్తారని సమాచారం. ఏప్రిల్ మొత్తం ఈ సర్‌ప్రైజెస్ ఉండేలా ప్లాన్ చేశారట రాధేశ్యామ్ చిత్ర బృందం. ఇక థియోట్రికల్ ట్రైలర్‌ని మేలో రిలీజ్ చేసేలా ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఒక్క ఏప్రిల్‌లోనే 5 పాటలతో పాటు టీజర్స్‌ని రిలీజ్ చేస్తారని సమాచారం. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయనుండగా... రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ -గోపికృష్ణ మూవీస్- టీ సిరీస్ భరీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు