ఈదురు గాలులకు భారీగా పంట నస్టంపంటలు చేతికందే సమయంలో వడగళ్లు, ఈదురు గాలులకు యేటా భారీగా పంట నస్టం చేకూరుతోంది. ఇటీవలి వడగళ్ల వానకు ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 591 మంది రైతులకు 780 ఎకరాల్లో వరి, సజ్జ, మొక్కజొన్న పంటలు పాడై రూ.ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లింది. నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇబ్రహీంపట్నం మండలం ముకునూరులో 71మంది రైతులకు సంబంధించి 131ఎకరాల్లో వరి పంట తుడిచిపెట్టుకుపోయినట్లు గుర్తించారు. మంచాల మండలం తాల్లపల్లిగూడ, తిప్పాయిగూడ, పటేల్‌ చెర్వు తండాల్లో 39మంది రైతుల 62ఎకరాల్లో పంటకు నస్టం వాటిల్లింది. యాచారం మండలం మేడిపల్లి తక్కెల్లపల్లి, మల్కీజ్‌గూడ గ్రామాల్లో 80మంది రైతుల 115ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మాడ్గుల మండలంలో అత్యధికంగా పంటలకు నష్టం జరిగింది. అన్నెబోయిన్‌పల్లి, ఆర్కపల్లి, సుద్దపల్లి, రామన్నపల్లి, దొడ్లపాడు, నాగిల్ల గ్రామాల్లో 373మంది రైతులకు సంబంధించి 443 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. అన్నెబోయిన్‌పల్లి, సుద్దపల్లిలో 24మంది రైతులకు సంబంధించి 25ఎకరాల్లో సజ్జ పంట, అన్నెబోయినపల్లిలో నలుగురు రైతులకు సంబంధించి 4ఎకరాల్లో మొక్క జొన్న పంట దెబ్బతిన్నట్లు అధికారిక లెక్కగట్టారు. వడగళ్లు, ఈదురు గాలులకు వందల ఎకరాల్లో మామిడి కాయులు నేలరాలి నష్టం జరిగింది. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.