`ఆర్‌ఆర్‌ఆర్‌` భారీ మల్టీస్టారర్‌ నుంచి కొత్త అప్‌డేట్

 


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్‌కి కారోనా సోకడంతో సినిమా షూటింగ్‌ని నిలిపివేశారనే ప్రచారం జరిగింది. కానీ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతూనే ఉందట. తాజాగా సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ విశాల్‌ మిశ్రా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సైలెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని చెప్పకనే చెప్పారు.


'ఈ రోజు స్టూడియోలో ఒక మేజిక్ జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ కమ్మింగ్‌ సూన్‌' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ లెక్కన  'ఆర్ఆర్ఆర్' రీ రికార్డింగ్ జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలోనే 'ఆర్ఆర్ఆర్' మీ ముందుకు రాబోతుంది అంటూ రాజమౌళి, కీరవాణి కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం విశేషం. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. బాహుబలి రెండు భాగాల తరవాత జక్కన్న నుంచి రాబోతున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై  ముందునుంచి భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.