గ్రేటర్‌లో భానుడు నిప్పులు

 


 గ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం నారాయణగూడలో 40.0, మల్కాజిగిరిలో 39.9, ఖైరతాబాద్‌లో 39.8, బాలానగర్‌, చార్మినార్‌లో 39.6, ఉప్పల్‌, నాంపల్లిలో 39.5, తిరుమలగిరి, శేరిలింగంపల్లిలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, సాయంత్రం మాత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది.