అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

 

అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్‌) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. మే 2 నుంచి 17 వ తేదీవరకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనుంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీబీఎస్సీ పరీక్షలు, జేఈఈ మెయిన్ వంటి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్‌ను కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో ఎన్‌టీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.


కాగా, దేశంలో వరుసగా ఐదో రోజు కూడా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,73,810 కేసులు రికార్డవగా, రికార్డు స్థాయిలో 1619 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటాయి. ఇందులో 1.78 లక్షల మంది బాధితులు కరోనాతో మరణించారు.