పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

 


పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే జనం బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతో ఉదయం 9.30 గంటల వరకు 16.04 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 విడుతల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ తుది విడుత పోలింగ్ జరుగుతున్నది. ఎనిమిదో విడుతలో ఆఖరి 35 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 35 స్థానాల్లో బరిలో నిలిచిన మొత్తం 283 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితాలు మే 2న వెల్లడికానున్నాయి.