కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో

 


కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో రోజునూ లాభాలతోనే ప్రారంభించాయి. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వాలు వేగవంతమైన చర్యలు చేపడుతుండడం, అంతర్జాతీయంగా పలు దేశాలు భారత్‌కు సహాయం చేసేందుకు ముందుకు రావడం మదుపర్లలో నమ్మకాన్ని పెంచాయి. వీటికి తోడు కీలక రంగాల సూచీలు, ప్రముఖ కంపెనీలు రాణిస్తుండడం కూడా కలిసి వస్తోంది.


49,066 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 9:55 గంటల సమయానికి 380 పాయింట్లు లాభపడింది. 14,653 వద్ద రోజును మొదలు పెట్టిన నిఫ్టీ ఉదయం 9:55 గంటల సమయానికి 107 పాయింట్లు ఎగబాకింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లాభాలను ఆర్జిస్తున్నాయి. బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాలను ఆర్జిస్తున్నాయి.