లవ్ స్టోరి సినిమాను పూర్తి చేసి మరో సినిమా షూటింగ్‌లో నాగ చైతన్య

 


అక్కినేని వారసుడు నాగ చైతన్య లవ్ స్టోరి సినిమాను పూర్తి చేసి మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ఈ కరోనా టైమ్‌లో కూడా ఆగకుండా షూటింగ్‌ను కానిచ్చేస్తోంది టీమ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీ జరుగుతోంది. థాంక్యూ పేరుతో వస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఈ సినిమాను ఆయన ఓ రేంజ్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమాను గట్టిగా ప్లాన్ చేసినట్లు సమాచారం. చెప్పాలంటే ఆయన సినిమాలు దేనికవే విభిన్నం. విక్రమ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. గతంలో అక్కినేని కుటుంబ హీరోలతో 'మనం' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించలేకపోతున్నాయి. విక్రమ్ మనం తర్వాత మరోసారి అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో మాత్రం కొంత నిరాశ పరిచింది. ఆ తర్వాత విక్రమ్ నానితో గ్యాంగ్ లీడర్ అనే థ్రిల్లర్‌ను తీశారు. అయితే ఆ సినిమా కథ బాగున్న పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటీ ఫలితాన్ని ఇవ్వనుందో.. ఇక ఈ సినిమాలో హరోయిన్'గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.