తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా.

 


తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపధ్యంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా థియరీ పరీక్షక అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డునిర్ణయించింది. దీనితో ప్రాక్టికల్స్ మే 29వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు జరగనున్నాయి. అలాగే మే 1వ తేదీ నుంచి 20 వరకు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను మూసి వేసింది తెలంగాణ సర్కార్.