జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం

 


మహబూబ్‌నగర్‌: జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్‌, కావేరమ్మపేట నుంచి గంగాపుర్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. కావేరమ్మపేటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు.

జడ్చర్ల హౌసింగ్ బోర్డు వద్ద రూ.15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.

పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తదితులు పాల్గొన్నారు.