దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు

 


 దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 93.99 వద్ద, డీజిల్ ధర 88.05 పైసల వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక విజయవాడలోనూ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 96.75 వద్ద ,డీజిల్ ధర 90.27 పైసల వద్ద నిలకడగా ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 40 పైసలు వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.