వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంటే సుందరానికీ

 

ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ, నేచురల్ స్టార్ నాని ఏ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్‌గా టక్ జగదీష్ చిత్రీకరణ పూర్తి చేసిన నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. కోలకతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం భారీ సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే నాని తన తదుపరి చిత్రం అంటే సుందరానికి మూవీ చిత్రీకరణ మొదలు పెట్టారు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంటే సుందరానికీ చిత్రీకరణను సమ్మర్‌లో జరుపుతామని మైత్రిమూవీ మేకర్స్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే తాజాగా షూటింగ్ మొదలు పెట్టారు. చిత్రంలో కథానాయికగా నజ్రియా నజీమ్‌ని ఎంపిక చేయగా, ఈ అమ్మడు నేటి షూటింగ్ లో పాల్గొననుంది. ఈరోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ముందుగా చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’ చాలా స్పెషల్‌” అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది నజ్రియా.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందించనున్నారు.