సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.

 


ఐపీఎల్ 14వ సీజన్‌‌కు ముందుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్ అందించింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ”తాను బయోబబుల్ జీవితంలో అలసిపోయాయని.. కుటుంబంతో మరింత సమయం గడపాలనుకుంటున్నానని”.. మార్ష్ జట్టు యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనితో అతడి స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్, టీ20 స్పెషలిస్ట్ జాసన్ రాయ్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. రాయ్ రాక ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. కాగా, గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో కూడా మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుతో జాయిన్ అవుతుండగా.. కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ చేరికపై ఇంకా సందిగ్దత నెలకొంది. సన్‌రైజర్స్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలివే..! ఏప్రిల్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ ఏప్రిల్ 14: సన్ రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ ఏప్రిల్ 17: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 21: పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs Delhi ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 28: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 2: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 4: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మే 7: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మే 9: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 19: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ బెంగళూరు మే 21: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్