అమెరికా నుంచి భారత్‌ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రి

 


: కరోనా సెకండ్‌ వేవ్‌తో భారత్‌ పోరాడుతున్నది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో పలు దేశాలు ముందుకు వచ్చి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు వైద్య పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం వంద మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించగా.. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి భారత్‌ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రిని అందుకున్నది. 400కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు ఒక మిలియన్ ర్యాపిడ్ కరోనావైరస్ టెస్ట్ కిట్లు, ఇతర పరికరాలతో, సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్‌పోర్టర్‌ ఇవాళ ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానంలో దిగింది.