నేడు సిఐడి విచారణకు మాజీ మంత్రి దేవినేని ఉమా హాజరు

 


నేడు సిఐడి విచారణకు మాజీ మంత్రి దేవినేని ఉమా హాజరుకానున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగళగిరి సిఐడి ఆఫీసులో దేవినేని ఉమ విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 10 న దేవినేని ఉమాపై 464, 465, 468, 469, 470, 471, 505, 120 (బి) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేవినేని ఉమ క్వాష్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు దేవినేని ఉమా సిఐడి విచారణకు హాజరుకానున్నారు.