పడవలో ప్రయాణిస్తూ భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇండియన్ కోస్ట్ గార్డ్

 

గుజరాత్‌లోని కచ్ వద్ద భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనపర్చుకున్నారు.పడవలో ప్రయాణిస్తూ భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరేబియా సముద్రం వెంబడి భారత సముద్ర సరిహద్దు లోపల వీరి పడవను పట్టుకున్నాయి. పదవలో 8 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ ట్విట్టర్‌లో గురువారం వెల్లడించింది.


గురువారం ఉదయం గుజరాత్ ఏటీఎస్‌తో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న జాఖౌ ఓడరేవు నుంచి పాకిస్తాన్ ఫెర్రీ పీఎఫ్బీ (పాకిస్తాన్ ఫిషింగ్ బోట్) ను ఐసీజీ పట్టుకున్నది. ఈ బోట్‌లో ఎనిమిది మంది పాకిస్తానీ పౌరులు ఉన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ను చూసి వారు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. పడవలో ఇండియాకు తరలించేందుకు తీసుకొచ్చిన 30 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఐసీజీ అందించిన సమాచారం ప్రకారం, స్వాధీనం చేసుకున్న హెరాయిన్ మార్కెట్ ధర రూ.150 కోట్ల వరకు ఉంటుంది. విచారణ సమయంలో అరెస్టు చేసిన చొరబాటుదారులు తమను మత్స్యకారులు అని చెప్పారు. ఈ మందుల పంపిణీ కచ్‌లోని జఖౌ పోర్టులో అందజేయాల్సి ఉందని తెలిపారు. హెరాయిన్ డెలివరీ ఎవరు తీసుకోబోతున్నారనే సమాచారం కూడా ఐసీజీకి లభించింది. ప్రస్తుతం ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..