పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సన్నిహితంగా ఉన్నవారందరు సెల్ఫ్ ఐసోలేషన్‌

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా ఉన్నవారందరు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్ళారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌ను తెరకెక్కిస్తున్న సాగర్ కె చంద్ర షూటింగ్‌లో భాగంగా పవన్‌కు మరింత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఆయన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఐసోలేషన్‌కు వెళ్లాడట. ఈ రోజు లేదా రేపు సాగర్ కరోనా పరీక్ష చేయించుకోనుండగా, అందులో నెగెటివ్ రిపోర్ట్ వస్తే తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నాడు.


మూడేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో అభిమానుల ఆకలి తీర్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో మలయాళంలో అద్భుత విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తుంది. పవన్, బిజూ మీనన్ క్యారెక్టర్ చేస్తుండగా.. రానా, పృథ్వీ రాజ్ పాత్రలో కనిపించనున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో పవన్ రాయలసీమ స్లాంగ్‌లో మాట్లాడనున్నాడని టాక్. సినిమాలో రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడానికి పెంచల్ దాస్, పవన్‌కి హెల్స్ చేస్తున్నారట. చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.