యాపిల్స్ కు తాము ఆర్డర్ చేస్తే యాపిల్ ఐఫోన్

 


యాపిల్స్ కు ఆర్డర్ ఇవ్వగా టెస్కో సూపర్ మార్కెట్ నుంచి ఏకంగా ఐఫోన్ ఎస్ఈ రావడంతో ఆ వ్యక్తి ఉత్సాహంతో గంతులేశాడు. సూపర్ సబ్ స్టిట్యూట్ ప్రమోషన్ కింద యాపిల్స్ తో పాటు ఐఫోన్ ఎస్ఈ బహుమతిగా రావడంతో ఇంగ్లండ్ లోని ట్వికెన్వాన్ టెస్కో ఎక్స్ట్రా నుంచి నిక్ జేమ్స్ (50) తన ఆర్డర్ ను కలెక్ట్ చేసుకున్నాడు. తన బ్యాగ్ లో సర్ ప్రైజ్ ఉందని అక్కడి సిబ్బంది జేమ్స్ కు చెప్పడంతో బ్యాగ్ తెరిచి చూడగా ఐఫోన్ ఎస్ఈ కనిపించడంతో ఆశ్యర్యానికి లోనయ్యాడు.


బుధవారం తాము క్లిక్ అండ్ కలెక్ట్ ఆర్డర్ ను కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లగా యాపిల్స్ కు తాము ఆర్డర్ చేస్తే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ తమకు దక్కడం సంతోషంగా ఉందని జేమ్స్ ట్వీట్ చేశాడు. సర్ ప్రైజ్ అంటే బ్యాగ్ లో ఈస్టర్ ఎగ్ మరొకటో ఉంటుందని అనుకున్నానని, అనూహ్యంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ కనిపించడంతో ఉద్వేగానికి లోనయ్యానని జేమ్స్ చెప్పుకొచ్చాడు. సూపర్ సబ్ స్టిట్యూట్ ప్రమోషన్ కింద టెస్కో మొబైల్ ఉచితంగా యాపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్, శాంసంగ్ డివైజ్ లను ఆఫర్ చేస్తోంది. పరిమిత స్టోర్లలో ఈనెల 18 వరకూ టెస్కో మొబైల్ 80 ఐటెమ్స్ ను వినియోగదారులకు ఉచితంగా అందించనుంది.