''మన రియల్‌ హీరో సోనూసూద్‌.. కరోనా నుంచి త్వరగా, పూర్తిగా కోలుకోవాలంటూ..........చంద్రబాబు ట్వీట్‌

 


కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆపన్నుల పాలిట రక్షకుడిగా మారి కీర్తిప్రతిష్టలు పొందిన నటుడు సోనూసూద్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని సోనూ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. ''మన రియల్‌ హీరో సోనూసూద్‌.. కరోనా నుంచి త్వరగా, పూర్తిగా కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్న ప్రజలతో నేను కూడా జత కలుస్తున్నాను.'' అని చంద్రబాబు ట్వీట్‌ చేశాడు. చంద్రబాబు ట్వీట్‌పై సోనూసూద్‌ వినమ్రంగా స్పందించారు. 'థాంక్యూ సో మచ్‌ సర్‌' అంటూ ట్విట్టర్‌ వేదికగా బదులిచ్చారు.