కోవిడ్ సెకండ్ వేవ్‌ని మొదట్లో లైట్ తీసుకున్నవారు ఇప్పుడు సీరియస్

 


కోవిడ్ సెకండ్ వేవ్‌ని మొదట్లో లైట్ తీసుకున్నవారు ఇప్పుడు సీరియస్‌గా తీసుకోక తప్పడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతూ పోతుండడంతో సినిమా రిలీజ్‌లతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతున్నాయి. స్టార్ హీరోలు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట, ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర షూటింగ్స్‌కు తాత్కాలిక బ్రేక్ వేయగా, ఇప్పుడు ఆచార్య షూటింగ్ కూడా ఆగిపోయింది.


లాక్‌డౌన్ తర్వాత ఆచార్య టీం శరవేగంగా చిత్రీకరణ జరిపింది. రామ్ చరణ్ సైతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో ఉన్నప్పటికీ తరచూ 'ఆచార్య' కోసం డేట్స్ కేటాయిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 80 శాతం షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. మిగతా పార్ట్ పూర్తి చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో షూటింగ్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆచార్య చెప్పిన డేట్‌కు వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి. చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.