బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్,ఢిల్లీ క్యాపిటల్స్ ఆటతీరుపై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు

 


ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్,ఢిల్లీ క్యాపిటల్స్ ఆటతీరుపై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈ ఐపీఎల్‌లో కొత్త జట్టు విజేతగా నిలుస్తోందన్నారు. ఈ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్ కోహ్లిల ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన రవిశాస్త్రి ''గతరాత్రి మ్యాచ్‌ అద్భుతంగా జరిగింది. ఈ సారి కొత్త జట్టు విజేతగా అయే అవకాశముంది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి'' అని తెలిపారు. ఇక ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ జట్టు అత్యుత్తమంగా రాణిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒకసారి కూడా విజేతగా నిలవలేదు. మంగళవారం అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆఖరి బంతికి 6 పరుగులు చేస్తే దిల్లీ విజయం సాధిస్తునగా.. క్రీజులో ఉన్న పంత్ ఫోర్‌ సాధించాడు. దీంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.


చెన్నైపై భారీ ఓటమి తర్వాత ఈ విజయం ఆ జట్టుకు భారీ ఊరటను ఇచ్చింది. ఈ విజయంతో బెంగళూర్ తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆరు మ్యాచులాడగా ఐదింటిలో విజయం సాధించింది. ఇక దిల్లీ క్యాపిటల్స్‌ ఆరు మ్యాచులు ఆడి.. నాలుగు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.