సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమా లో యాంకర్ అనసూయ కీలక పాత్ర

 


సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమా లో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ అమ్మడు. వివరాల్లోకి వెళిత.. బుల్లితెరపై యాంకర్‏గా చేస్తూనే.. అటూ వెండితెరపై తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది జబర్ధస్థ్ బ్యూటీ అనసూయ. అప్పటివరకు టెలివిజన్ యాంకర్‏గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత అక్కినేని ప్రధాన పాత్రలలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగ స్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ మారిపోయింది. తాజాగా మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోంటుంది అనసూయ. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

మంచి రోజులు ముందున్నాయి. మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. దేవీశ్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన 'థ్యాంక్యూ.బ్రదర్‌' సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం అనసూయ రవితేజ 'ఖిలాడి', కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న 'రంగమార్తాండ' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.