జమ్ముకశ్మీర్‌లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టారు. జమ్ము కశ్మీర్‌లోని అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చేపడతున్న వారిపై ఒక్కసారిగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి వుందని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
అంతేకాకుండా షోపియాన్ జిల్లాలో కూడా కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. షోపియాన్ లోని మసీదులో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో..టెర్రరిస్టులపై భద్రతా దళాలు కాల్పులకు దిగారు.షోపియాన్ లో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం. మసీదులో నుంచి ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు, ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని సమాచారం.