తెలంగాణలో టైగర్ టెన్షన్

 


తెలంగాణలో టైగర్ టెన్షన్ మళ్లీ మొదలైంది. కొమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం ఆగర్ గూడలో పులి సంచారం చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులపై పులి దాడి చేయడంతో అందులో ఓ ఎద్దు మృతి చెందగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారాన్ని అందించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక భయం గుప్పిటలో ఉన్నారు