కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం

 


కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే నిన్న ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కాస్త తనకు ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా చాల వెరైటీ గా ట్వీట్ చేసింది. "మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్' అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. దింతో ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది. ఇంకేముంది మంచి లక్ష్మిపై కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. "ఒకవేళ నీ సినిమాలు చూస్తే అందరు చనిపోతారు. దానికంటే కరోనా తో సావాసం చేయడమే చాలా ఉత్తమం" అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.