సోనీ నుండి సరికొత్త మొబైల్ లాంచ్.

 


స్మార్ట్ ఫోన్ ప్రేమికుల కోసం ఒక స్పెషల్ న్యూస్. జపాన్ కంపెనీ సోనీ సరికొత్త మొబైల్ ను లాంచ్ చేయబోతోంది. సోనీ మోస్ట్ సక్సెస్ ఫుల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఎక్స్‌పీరియా సరికొత్త ఫోన్ విడుదల చేయబోతోంది. సోనీ ఎక్స్‌పీరియా ప్రేమికుల కోసం ఎక్స్‌పీరియా 1 III ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపింది. ఆ ఛానెల్ లో ఉంచిన ఓ వీడియోలో ఎక్స్‌పీరియా 1 III ను అధికారికంగా ఆరోజు సాయంత్రం 16:30 గంటలకు (జపాన్ సమయం ప్రకారం) లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి అధికారికంగా పూర్తి వివరాలు సోనీ వెల్లడి చేయాలేదు. అయితే, స్మార్ట్ ఫోన్ సర్కిళ్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ఐ ఫోన్ మినీకి ఆండ్రాయిడ్ వెర్షన్ లా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక సోనీ ఎక్స్‌పీరియా 1 III ఫోన్ స్పెసికేషన్స్ విషయానికి వస్తే ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ చెబుతున్న దాని ప్రకారం ఇలా ఉండొచ్చు. ఎక్స్‌పీరియా 1 III 6.5 అంగుళాల 4కె ఓఎల్ఈడీ డిస్ ప్లే తో రానుంది. ఇంకా.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ 12జీబీ రామ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్స్ ఛార్జింగ్ హెడ్ ఫోన్ జాక్ మైక్రో ఎస్డీ కార్డు వంటి స్పెషికేషన్స్ తో వస్తోంది. సెప్టెంబర్ 2020లో సోనీ ఎక్స్‌పీరియా 5 II స్మార్ట్ ఫోన్ మూడు వెనుక కెమెరాలతో స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ తో విధుల చేసింది