ఊట్కూరు మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం

 


నారాయణపేట : జిల్లాలోని ఊట్కూరు మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు వార్డుల్లో భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది.