ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభం రెట్టింపు

 


గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో క్రెడిట్‌ కార్డ్‌ల కంపెనీ ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభం  రెట్టింపైంది. రూ. 175 కోట్లుగా నమోదైంది. 2019–20నాలుగో క్వార్టర్‌లో ఇది రూ. 84 కోట్లు. తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 2,510 కోట్ల నుంచి రూ. రూ. 2,468 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 2,398 కోట్ల నుంచి రూ. 2,234కోట్లకు దిగివచ్చాయి. మరోవైపు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 21 శాతం క్షీణించి రూ. 1,245 కోట్ల నుంచి రూ. 985 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రెట్టింపై 2.01 శాతం నుంచి 4.99 శాతానికి పెరగ్గా.. నికర ఎన్‌పీఏలు 0.67 శాతం నుంచి 1.15 శాతానికి చేరాయి.