యంగ్‌ హీరో నితిన్‌ జోరుయంగ్‌ హీరో నితిన్‌ జోరుమీదున్నాడు. ఈ ఏడాది 'చెక్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్‌ 'మ్యాస్ట్రో' సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడు అంధుడిగా కనిపించనున్నాడు. దీని తర్వాత నితిన్‌ వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫిదా భామ సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం.