కరోనా సెకండ్ వేవ్ ను హైదరాబాద్ వాసులు సీరియస్

 


 కరోనా సెకండ్ వేవ్ ను హైదరాబాద్ వాసులు సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రజలు ఇలాగే ఉంటే, కఠిన చర్యలు తీసుకోక తప్పదని హైదరాబాద్ నగల పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. నిత్యమూ కేసులు పెరిగిపోతుంటే, ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోక తప్పేలా లేదని ఆయన అన్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, సుమారు కోటి మందికి పైగా జనాభా ఉన్నజీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులను ఎవరూ లెక్క చేయడం లేదని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి వ్యక్తిపై నిరంతరం అప్రమత్తత అవసరమని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను ఎంతమాత్రమూ పాటించడం లేదని, స్వీయ రక్షణ, తమ కుటుంబీకుల రక్షణ గురించి ప్రజలు మరిచారని అన్నారు. మాస్క్ లు లేకుండా వీధుల్లో తిరిగితే కేసులు నమోదు చేయక తప్పదని హెచ్చరించారు. రానున్న పండగల సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు.