ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న పెన్ ఇండియా లిమిటెడ్ స్టూడియోస్.

 


భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్``. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. తాజాగా ఈ సినిమా నార్త్ ఇండియా హక్కులను ప్రముఖ బాలీవుడ్ స్టూడియో `పెన్ ఇండియా లిమిటెడ్` దక్కించుకుంది. ఉత్తర భారతదేశానికి సంబంధించినంతవరకు `ఆర్ఆర్ఆర్` థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కులను ఈ సంస్థ భారీ ధరకు చేజిక్కించుకుంది. బాలీవుడ్‌‌లో భారీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న `పెన్ ఇండియా` `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం రికార్డు స్థాయి ధర కోట్ చేసిందట. `బాహుబలి-2`ను మించిన స్థాయిలో విడుదలకు ఇప్పటి నుండే `పెన్‌ ఇండియా` సంస్థ ప్రయత్నాలు ప్రారంభించిందట. ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.