నోమాడ్ ల్యాండ్‌కు ఉత్తమ దర్శకులుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మహిళగా చోలే

 


సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే 93వఆస్కార్ అవార్డ్‌ల కార్యక్రమం ఏప్రిల్ 25 అర్ధరాత్రి ప్రారంభమైంది. కోవిడ్ 19 వలన గత ఏడాది ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమానికి ఆటంకం ఏర్పడగా, ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం స్టార్ వరల్డ్, స్టార్ మూవీస్‌లో సోమవారం ఉదయం 5.30 నుంచి భారత్‌లో ప్రసారం అవుతుంది. ఈ అవార్డుల వేడుకను ఆస్కార్.కామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కాగా, ఇటీవల బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, ఆమె భర్త ఇంటర్నేషన్ సింగర్ నిక్ జోనస్ ఆస్కార్ అవార్డు నామినేషన్లను ప్రకటించడం తెలిసిందే.


ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) నిర్వహిస్తుంది. కోవిడ్ వలన అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ లలో జరుగుతుంది. డాల్బీ థియేటర్ 2001 నుండి ఆస్కార్‌కు వేదికగా ఉన్న విషయం తెలిసిందే. అయితే 93వ అకాడమీ అవార్డ్ వేడుకలో నోమాడ్ ల్యాండ్‌కు ఉత్తమ దర్శకులుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మహిళగా చోలే జావో చరిత్ర సృష్టించారు. ది హర్ట్ లాకర్ దర్శకుడు కాథరిన్ బిగెలో తర్వాత ఆస్కార్ చరిత్రలో అవార్డును గెలుచుకున్న రెండవ మహిళ కూడా ఈమెనే.


ప్రతి ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో జరిగే కరోనా అవార్డుల వేడుక ఈ ఏడాది కరోనా వలన ఏప్రిల్‌లో జరుగుతుంది. ఆస్కార్ అవార్డు ప్రారంభమైన 92 యేళ్లలో ఈ వేడుక ఇలా వాయిదా పడటం నాల్గోసారి. 1938లో లాస్ ఏంజెల్స్‌లో వరదలు ముంచెత్తినపుడు ఓసారి వాయిదా పడగా, ఆ తర్వాత 1968లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ హత్య జరిగిపుడు రెండు రోజులు, 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై హత్య యత్నం జరిగినపుడు ఈ వేడుకలను వాయిదా వేశారు.


ఆస్కార్ అవార్డ్‌ల జాబితా పరిశీలిస్తే..


ఉత్తమ నటుడు- ఆంథోనీ హాప్కిన్స్, ది ఫాదర్

ఉత్తమ నటి- ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్, నోమ్యాడ్ ల్యాండ్


ఉత్తమ దర్శకురాలు- చోలే జావో ( నో మ్యాడ్ ల్యాండ్‌)


విజువల్ ఎఫెక్ట్స్ – టెనెట్

ఉత్తమ సంగీతం- సౌండ్ ఆఫ్ మెటల్

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- టూ డిస్టాంట్ స్టేంజర్స్

యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ

యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- సోల్

డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ – కోలెట్

ఒరిజినల్ స్క్రీన్ ప్లే- ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ( ఎమరాల్డ్ ఫెన్నల్‌)

అడాప్టడ్ స్క్రీన్ ప్లే – ది ఫాదర్

అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ – అనదర్ రౌండ్

ఉత్తమ సహాయ నటుడు- డేనియల్ కలుయా, జుడాస్, ది బ్లాక్ మెసియా

ఉత్తమ సహాయ నటి- యుష్‌-జంగ్ యూన్( మినారి)

మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్‌- మా రైనీస్ బ్లాక్ బాటమ్

కాస్ట్యూమ్ డిజైన్- మా రైనీస్ బ్లాక్ బాటమ్

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- అనదర్ రౌండ్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఫైట్ ఫర్ యూ, జుడాస్ అండ్ ది బ్లాక్ మెసియా

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- మై అక్టోపస్ టీచర్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌: కొలెట్టె

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: టూ డిస్టంట్ స్ట్రేంజర్స్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మంక్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: మంక్

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్: మా రైనీస్ బ్లాక్ బాటమ్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: మా రైనీస్ బ్లాక్ బాటమ్

ఉత్తమ ఫిలిం ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌: టెనెట్