హైటెక్‌ సిటీ, ఎంఎంటీఎస్ మార్గంలో రైల్వే అండర్‌ బ్రిడ్జినీ ప్రారంభించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.

 


హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. హైటెక్‌ సిటీ, ఎంఎంటీఎస్ మార్గంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో నిర్మించిన రైల్ అండర్ బ్రిడ్జిని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు, మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు రూ.1, 010 కోట్ల పైగా వ్యయంతో చేపట్టిన 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులో వచ్చాయి. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హై టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఎస్.ఆర్.డి.పి మొదటి దశలో భాగంగా గచ్చిబౌలి నుండి జెఎన్‌టీయూ వరకు చేపట్టిన ఫ్లయ్ ఓవర్లు, అండర్ పాస్ లైన్, బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జుంక్షన్స్ ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో నగరవాసులు ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తూ ఫలితాలను పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో హై టెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ ఆర్.యు.బి నిర్మాణంతో తీరుతున్నందుకు స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు