ఆచార్య సినిమా క రోనా వల్ల షూటింగ్ లేట్

 


మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. రెండో ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు. పెద్ద డైరెక్టర్ లతో పాటు టాలెంట్ ఉన్న యువ దర్శకులను సైతం లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఐదు సినిమాలను సెట్ చేస్తున్నాడు. కాగా వాటిలో ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతోంది. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయి విడుదల కావాలి.


కానీ కరోనా వల్ల షూటింగ్ లేట్ అయింది. అంతే కాకుండా ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ దారుణంగా ఉండటంతో సినిమా విడుదలను కూడా మూవీటీం వాయిదా వేస్తున్నట్టు సమాచారం. వచ్చే మే నెలలో మూవీని విడుదల చేయాలని అనుకున్నారు.కానీ ఇప్పుడు జూన్ లో విడుదల చేయాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా చిరు ఆచార్య తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆచార్య తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుంది. అయితే ఈ సినిమా ఒక కోర్ట్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఠాగూర్ సినిమా లాగా సమాజంలో ఉన్న లోపాలను, అవినీతిని ఎత్తి చూపే కథ అని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషనల్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ అని మూవీ టీం సన్నిహితుల ద్వారా బయటకు తెలిసింది. అంతే కాకుండా ఈ సినిమాకు వీరయ్య అనే టైటిల్ ను పెట్టేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం.