కుప్పం మండలం ఉరినాయనపల్లిలో ఏనుగుల గుంపు హల్‌చల్

 


చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం ఉరినాయనపల్లిలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. గుడ్లనాయనపల్లి, ఉరి నాయనపల్లి గ్రామాల పరిసరాల్లో సంచరించిన ఏనుగులు పంట పొలాపై దాడి చేశాయి. వరి, కూరగాయ పంటలను నాశనం చేశాయి. నీటి ట్యాంక్‌లు, కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. గత రాత్రి ఊరినాయనపల్లి గ్రామంలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేయడంతో గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు.