ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

 


ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ANSET CEO గా పని చేస్తున్న సి.హరి ప్రసాద్ ను.. కర్నూలు ఆర్డీవోగా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ బి. చంద్రలీలకు నెల్లూరు ఎఫ్ఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ అద్దయ్యకు ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ పి. ఉమాదేవికి ప్రకాశం జిల్లాలో ఎఫ్ఎస్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణ మూర్తికి విజయనగరం జిల్లా ఎఫ్ఎస్ఓగా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్.