బస్సులో భారీగా బంగారు, వజ్రాభరణాలు

 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచ


లింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సులో భారీగా బంగారు, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దుల్లోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రూ.1.04 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను గుర్తించారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. వీటిని హైదరాబాద్‌ నుంచి మధురై తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరని అరెస్టు చేశామన్నారు.


గత శనివారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేశారు. అందులో రూ.3 కోట్లకుపైగా నగదు, కిలో బంగారం లభించింది. పట్టుబడిన నగదు చెన్నైలోని రామచంద్ర మెడికల్‌ కాలేజీకి చెందినదిగా, బంగారం హైదరబాద్‌లోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్‌కు సంబంధించిందిగా గుర్తించారు.