'శ్రీకారం' ఓటీటీలోకి

 


రీసెంట్‌గా టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన 'శ్రీకారం' ఓటీటీలోకి వచ్చేస్తోంది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా బావుందన్న టాక్ వచ్చింది. పలువురు ప్రముఖుల నుంచి ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి. కానీ అంత కమర్షియల్ సక్సస్‌గా మాత్రం నిలవలేకపోయింది. కాగా మార్చి 19న విడుదలైన 'శ్రీకారం' సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. సన్‌నెక్స్ట్‌ యాప్‌లో ఏప్రిల్‌ 16 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. చూడాలి మరి ఓటీటీలో 'శ్రీకారం' సత్తా చాటుతుందా లేదా.