ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌తోపాటు మునిసిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు

 


ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌తోపాటు మునిసిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నామని పలు సంఘాల నేతలు వెల్లడించారు. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఎంబీసీ రాష్ట్ర కో-కన్వీనర్‌ కొండూరు సత్యనారాయణ, రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్‌ అక్కరాజు శ్రీనివాస్‌, నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ మాట్లాడారు. ఎంబీసీలు, రజకులు, నాయీబ్రాహ్మణులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ధోబీఘాట్‌, లాండ్రీలు, సెలూన్‌లకు నెలకు 250 యూనిట్ల ఉచిత కరెంట్‌ సరఫరాకు సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల రాష్ట్రంలోని రజకులు, నాయీ బ్రాహ్మణులు ఆయనకు రుణపడి ఉన్నారని వారన్నారు.