రాజస్థాన్‌లోని రెండవ అతిపెద్ద పట్టణమైన జోధ్‌పూర్‌లో కరోనా విలయతాండవం

 


రాజస్థాన్‌లోని రెండవ అతిపెద్ద పట్టణమైన జోధ్‌పూర్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 1200 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల వ్యవధిలో జోద్‌పూర్‌లో కరోనాతో 38 మంది మృతి చెందారు. తాజాగా నమోదవుతున్న కేసులలో యువత, చిన్నారులు అధికంగా ఉంటున్నారు. తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవానులు కరోనా బారిన పడ్డారు. దీనికిముందు 21 మంది జవానులు కరోనా బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నైట్ కర్ఫ్యూను అదనంగా మరో రెండు గంటలు పొడిగించారు. దీంతో ఇకపై సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.