ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు భారత వైమానిక దళ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా ఫ్రాన్స్‌కు

 


 ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు భారత వైమానిక దళ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య ఆయన పర్యటన జరగనున్నది. ఫ్రాన్స్‌లోని పోర్ట్ నగరం బోర్డియాక్స్‌లో ఉన్న మెరిగ్నాక్ ఎయిర్‌బేస్ వద్ద ఆరు రాఫెల్ యుద్ధ విమానాలకు ఆయన ఫ్లాగ్ ఆఫ్ చెప్పనున్నారు. ఆ పర్యటన సమయంలో ఫ్రెంచ్ సైనికాధికారులను ఆయన కలుసుకుంటారు. భదౌరియా పర్యటనతో రెండు దేశాల మధ్య వైమానిక బంధాలు మరింత బలపడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ చీఫ్ జనరల్ ఫిలిప్ లవిగ్నే ఇండియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఎయిర్ చీఫ్ ఫిలిప్‌తో భదౌరియా చర్చలు నిర్వహించనున్నారు. రెండు దేశాలకు చెందిన వైమానిక దళాలు గరుడ పేరుతో గగన విన్యాసాలు చేపడుతున్నాయి.