లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి లక్షల మధ్య ధర ఉన్న అధునాతన చెరకు రసం యంత్రాలు అందుబాటులోకి రావడంతో చిన్న, సన్నకారు రైతులు అనేక మంది ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. చెరకు ధర బాగా పతనమైన దశలో చేపట్టిన ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని రైతులు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రైతు వీరారెడ్డి, నెల్లూరుకు చెందిన మరో రైతు రామమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యాపారం రైతులకు ఏటీఎం తరహాలో నిత్యం ఆదాయాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.


నాబార్డ్‌లోని నాబ్‌–కిసాన్‌ విభాగం వ్యక్తుల జీవనోపాధి, ఆదాయ పెంపు కార్యకలాపాలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోలు) ద్వారా రుణం ఇస్తుంది. ఎఫ్‌పీవోలో ఉండే మూలధనానికి ఐదు రెట్ల రుణాన్ని ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇస్తుంది. సక్రమ చెల్లింపుల అనంతరం వడ్డీ రాయితీ కూడా వర్తింప చేస్తుంది. వ్యక్తులకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వదని నాబార్డు ఏపీ సీజీఎం సుధీర్‌కుమార్‌ చెప్పారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ చిరు వ్యాపారులకు 35 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తోంది.