జాతి రత్నాలు సీక్వెల్ చేసే ఆలోచనలో

 


ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మహేష్ బాబు, కేటీఆర్, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలను సైతం ఈ సినిమా ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి, రామకృష్ణ, ప్రియదర్శి తమ తమ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఈ జోగిపేట కుర్రాళ్లు తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలోను సత్తా చాటారు.


అమెరికాలోను జాతి రత్నాలు సినిమాకు మంచి ఆదరణ దక్కింది. అనుదీప్ తెరకెక్కించిన ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌కు ప్రస్తుతం సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మొదటి భాగంలో పొట్టకూటి కోసం ముగ్గురు కుర్రాళ్లు హైదరాబాద్ వస్తే ఈసారి మాత్రం అమెరికా వెళ్తారట. అక్కడ వారు పడే కష్టాలని మరింత ఫన్నీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట. జాతి రత్నాలు చిత్రం స్టైల్‌లోను ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొదించబోతున్నట్టు టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.