తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ... రోజుకు రెండు వేలకు పైగా కేసులు

 


తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ఆ గ్రామంలో 25 కు పైగా కేసులు వెలుగుచూసాయి. దీంతో ఆ గ్రామంలోని పెద్దలు కరోనా కట్టడికి ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో స్వచ్చంద లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.