భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడు

 భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగాయి.. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సెలవు కావడంతో తాజా వారంలో మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. కొవిడ్‌, లాక్‌డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు మంగళవారం ఊపిరి పీల్చుకుని, లాభాల బాటన సాగాయి. ఒక్కరోజు శెలవు అనంతరం ప్రారంభమైన దేశీ మార్కెట్లు మూడో సెషన్ లోనూ లాభాల్లో ముగిశాయి. ఇక వీకెండ్ సెషన్ లోనూ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన సాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు జంప్ చేసి 48,870 వద్దకు చేరగా , నిఫ్టీ 44 పాయింట్లు ఎగసి 14,626 వద్ద స్థిరపడ్డాయి. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 759 పాయింట్లు, నిఫ్టీ 217 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి. కాగా తాజా వారంలో విదేశీ ఇన్వెస్టర్లు 438 కోట్ల రూపాయల విలువైన షేర్లను, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 658 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.