మెగా పవర్ స్టార్ రంగస్థలం సినిమాతో ఎంత పెద్ద విజయం

 


మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కొద్దికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇంత తక్కువ టైమ్‌లో స్టార్ హీరో అవడం అంటే మామూలు విషయం కాదు. కొందరికి ఎన్నో ఏళ్లుగా ట్రై చేసినా రాని స్టార్ డమ్ రామ్‌చరణ్‌కు మాత్రం తొందరగానే వచ్చిందని చెప్పాలి. ఇక ఈ మెగా పవర్ స్టార్ రంగస్థలం సినిమాతో ఎంత పెద్ద విజయం అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాలి. పల్లెటూరి జానపద నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.


ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రంగస్థలం తమిళ ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్‌. తమిళ ప్రేక్షకుల కోసం అక్కడి అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేశారు యాజమాన్యం. అరుదుగా వచ్చే ఇలాంటి రఫ్ అండ్ రస్టిక్ సినిమాలు తమిళంలో ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. తమిళంలో 7జి ఫిలిమ్స్ వారు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని మలయాళంలో కూడా విడుదల చేశారు. ఇక తమిళంలో ఈ సినిమాకు ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి. ఇప్పుడున్న కొవిడ్ టైమ్ లో విడుదల చేస్తారా లేక విడుదల తేదీని వాయిదా వేస్తారా అనేది చూడాలి. తమిళలంలో బాగానే కేసులు ఉన్నాయి. తెలుగులో థియేటర్లు బంద్ చేసిన నేపథ్యంలో తమిళంలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.