లాక్‌డౌన్‌లో తన ఇంటి వద్ద సేంద్రీయ పంటలు : మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌

 


నటుడిగా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఇప్పుడు అతడు నటనలో కాకుండా మరో పనిలో లీనమయ్యాడు. లాక్‌డౌన్‌లో తన ఇంటి వద్ద సేంద్రీయ పంటలు పండించాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో ఆయన మొక్కలకు నీళ్లు పడుతూ, వాటి సంరక్షణ చూస్తూ రైతుగా మారిపోయాడు.

సోరకాయలు, మిరపకాయలు, టమాటలు, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు.. ఇలా చాలా రకాల కూరగాయలతో పాటు ఆకుకూరలను పండించినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ అతడే స్వహస్తాలతో తెంపుతుండటం విశేషం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తన టీమ్‌తో కలిసి ఈ వీడియోను టీజర్‌ మాదిరిగా కట్‌ చేయించి రిలీజ్‌ చేశాడు మోహన్‌ లాల్‌. ఈ సందర్భంగా అందరూ బాల్కనీల్లో లేదా టెర్రస్‌ల మీద నచ్చిన కూరగాయలను పండించుకోవచ్చని సూచించాడు.