తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టూర్ షెడ్యూల్

 


తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టూర్ షెడ్యూల్ ఖరారయ్యింది. గురువారం ఉదయం 10 గంటలకు అనపర్తి మండలంలో లోకేష్ పర్యటించనున్నారు. రాయవరం గ్రామంలో ప్రభుత్వ అక్రమ కేసులు, అక్రమ అరెస్టుల నేపథ్యంలో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. సాయంత్రం 3 గంటలకు కృష్ణాజిల్లా బందరులో లోకేష్ పర్యటించనున్నారు. మచిలీపట్నంలో ఇటీవల మరణించిన మాజీ మంత్రి, టీడీపీ నేత నడకుదిటి నరసింహారావుకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.