అసోంలో భారీ భూకంపం

 


గువాహటి: అసోంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.51 గంటలకు సోనిత్‌పూర్‌లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దాని తీవ్రత 6.4గా నమోదయ్యింది. భూకంప తీవ్రతతో నగౌన్‌లోని పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లులు కొద్దిగా కదిలాయి. ఒక ఇళ్లు మరో ఇంటిపైకి ఒరిగిపోయింది. అయితే భూప్రకంపణలు ప్రారంభంకాగానే ఇళ్లలోని జనాలు బయటకు పరుగులు తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.